కార్తికేయ 2 తో భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన నిఖిల్..ఒక్క సినిమాకి అన్ని కోట్లా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోల్లో ఒకరికి మంచి గుర్తింపున సంపాదించుకున్న నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ హీరో గా నటించిన  సినిమా కార్తికేయ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ హిట్గా నిలిచింది అని చెప్పాలి. ఇక తెలుగు సినిమాగా వచ్చిన కార్తికేయ 2ను హిందీలో కూడా రిలీజ్ చేశారు. ఇక అక్కడ ఈ సినిమా ప్రేక్షకులకు చాలా నచ్చింది .ఫలితంగా ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఇచ్చిన బూస్టుతో ఈయన ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 

18 పేజీస్ అని బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది .అయితే కార్తికేయ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈయన  ప్రస్తుతం ఆయన రెమ్యూనికేషన్ ఒక్కసారిగా అమాంతం పెంచేసాడు అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారాయి.. అయితే గతంలో ఈయన ఒక్క సినిమాకి దాదాపు నాలుగు నుండి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్  తీసుకునే వాడట. కానీ ఇప్పుడు కార్తికేయ 2 సినిమా సక్సెస్ అనంతరం ఆయన రెమ్యూనికేషన్ను ఏకంగా 8 కోట్లకు పెంచేసాడు అనే  వార్తలు వినిపిస్తున్నాయి.

 ఇక ఈయన ప్రస్తుతం సైన్స్ చేస్తున్న సినిమాలకు ఎనిమిది కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈయన హీరోగా నటించిన 18 పేజీ సినిమా డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పలనాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేశారు .ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి .దీంతో నిఖిల్ తీసుకుంటున్నారు గురించి వస్తున్న వార్తలు కాస్త సోషల్ మీడియా లేదు కదా వైరల్గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: