వారిసు: తలపతి కోసం సూపర్ స్టార్?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన దిల్ రాజు నేడు టాలీవుడ్ ను లీడ్ చేసే రేంజ్ కు ఎదిగారు. దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా వస్తుంది అన్నా లేదా.. దిల్ రాజు ప్రత్యేకంగా ఓ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు అని టాక్ వచ్చినా ఆ సినిమాలకు భారీ క్రేజ్ ఏర్పడుతుంది. ఈమధ్య వచ్చిన సూపర్ హిట్ చిత్రాలు 'మసూద' 'లవ్ టుడే'.. దిల్ రాజు రిలీజ్ చేసినవే. ఇక 2023 సంక్రాంతికి దిల్ రాజు తన సినిమా కోసం 'వాల్తేరు వీరయ్య' 'వీరసింహారెడ్డి' సినిమాలకు థియేటర్లు లేకుండా చేస్తున్నారు అంటూ ఆరోపణలు ఎదురుకున్న సంగతి తెలిసిందే. నైజాం ఏరియా మొత్తం 'వారిసు'(వారసుడు) కి ఎక్కువ థియేటర్లను కేటాయించారు. కానీ డబ్బింగ్ సినిమాకి ఆయన అన్ని థియేటర్లు ఎలా ఇస్తారు అనే గొడవ కూడా ఉంది.


సంక్రాంతి పండుగ సీజన్లో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇవ్వడం కుదరదు అని గతంలో దిల్ రాజు చెప్పారు. ఇప్పుడేమో ప్లేట్ మార్చాడు.'వారిసు' సినిమా ప్రమోషన్స్ ను ఫుల్ స్వింగ్ లో నిర్వహించడానికి దిల్ రాజు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుండి ఆల్రెడీ రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. అవి కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక రేపటి నుండి 'వారిసు' ప్రమోషన్ల జోరు కూడా మరింతగా పెరగనుంది.ఇక అంతేకాదు ప్రీ రిలీజ్ కు గెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం.. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని గెస్ట్ గా తీసుకురాబోతున్నారట.ఎందుకంటే దిల్ రాజుకి మహేష్ బాగా క్లోజ్.. అలాగే దర్శకుడు వంశీ పైడిపల్లి కి మహేష్ చాలా మంచి ఫ్రెండ్. ఇక హీరో విజయ్ కూడా మహేష్ కు కాలేజీ ఫ్రెండ్. దీంతో 'వారసుడు' మూవీని తెలుగులో మహేష్ ప్రమోట్ చేయడానికి రెడీ అయినట్టు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: