సలార్
సినిమా రిలీజ్ కు ముందే ఈ
సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.అయితే
ఎన్టీఆర్ కు జోడీగా క్రేజ్ ఉన్న
హీరోయిన్ ను ఎంపిక చేయాలని అభిమానులు సూచనలు చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ సినిమాలలో హీరోయిన్ల ఎంపిక విషయంలో కొన్ని విమర్శలు అనేవి ఉన్నాయి. సలార్ సినిమాలో
ప్రభాస్ కు జోడీగా నటిస్తున్న
శృతి హాసన్ విషయంలో
డార్లింగ్ అభిమానులు పూర్తిస్థాయిలో సంతృప్తితో లేరు.
తారక్ కు మాత్రం పాపులారిటీ ఉన్న
హీరోయిన్ ని ఎంపిక చేయాలని
తారక్ అభిమానులు కోరుకుంటున్నారు.ఇక
ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ ను పరిగణనలోకి తీసుకుని
ప్రశాంత్ నీల్ తారక్31 వ సినిమాకి
హీరోయిన్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
బాలీవుడ్ హీరోయిన్ ను
ఎన్టీఆర్ కు జోడీగా ఎంపిక చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండగా
ప్రశాంత్ నీల్ మనస్సులో ఏ
హీరోయిన్ వుందో తెలియాల్సి ఉంది. 2023 సంవత్సరం ఆగష్టు నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది.