సౌందర్య చనిపోయే ముందు ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించుకుందో తెలుసా..!?

Anilkumar
తెలుగు సినీ పరిశ్రమలో సావిత్రి తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా మలయాళ, తమిళ ఇండస్ట్రీలలో కూడా  చాలా సినిమాలలో నటించింది సౌందర్య. ఎప్పుడు కూడా ఎక్స్పోజింగ్ పాత్రలకు ఒప్పుకునేది కాదు. కేవలం ఫ్యామిలీ వుమెన్ లాగా సంప్రదాయమైన పాత్రలోని నటించేందుకు అంగీకరించేది. ఇప్పటికీ సౌందర్య చనిపోయి 17 ఏళ్లు గడిచినా కూడా ఆమె అభిమానం మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. ఆమె మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక సౌందర్య విమాన ప్రమాదంలో చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే .అయితే సౌందర్య చనిపోవడానికి ముందు అనేక ప్రమాదాల నుండి తప్పించుకుని బయటపడింది అని వార్తలు ఇప్పుడు వినబడుతున్నాయి. అయితే తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన మానవ కోటేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌందర్య గురించి చాలా విషయాలను చెప్పడం జరిగింది.ఆయన మాట్లాడుతూ సౌందర్య శివశంకర్ అని సినిమాలో నటించే టైంలో సౌందర్య కూర్చున్న ప్లేస్ లోనే లైట్ మ్యాన్ కూడా కూర్చున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి పైనుంచి ఎవరో పడ్డట్టు శబ్దం వచ్చింది. ఇక ఆ సమయంలో సౌందర్య అక్కడ లేదు సౌందర్య కూర్చున్న ప్లేస్ లోనే ఆ వ్యక్తి కూడా ఉన్నాడు.

అక్కడి నుండి 15 అడుగులు ఎత్తు నుండి ఓ వ్యక్తి కింద పడ్డారు  ఒకవేళ సౌందర్య పై పడి ఉంటే ఆమె చనిపోయేది .ఇదొక్కటే కాదు ఇంకో రెండు మూడు సంఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రతి సంఘటనల లోనుండి సౌందర్య బయటపడింది .ఎంత బయటపడినప్పటికీ చివరికి విమాన ప్రమాదం నుండి తప్పించుకోలేకపోయింది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. చివరిగా సౌందర్య నటించిన శివశంకర్ సినిమా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె లేకపోవడం నేను ఇండస్ట్రీకి ఇప్పటికీ తీరని లోటు . ఆమె చనిపోయిన తర్వాత ఆమె లాంటి హీరోయిన్ ని నేను ఇప్పటికీ చూడలేదు అంటూ ఆ ఇంటర్వ్యూలో భాగంగా మానవ కోటేశ్వరరావు చెప్పవచ్చారు .ఈయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: