తలపతి విజయ్ కోసం రంగంలోకి దిగుతున్న స్టార్ హీరో..?

Anilkumar
ఈ సంక్రాంతి కానుకగా టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాయి.ఇక ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాల పరంగా చిరకాల ప్రత్యర్ధులుగా మొదటి నుండి కూడా  పోటీ కొనసాగుతుంది. అయితే అలాంటి ఈ టాప్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటారు అని వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక వీరిద్దరితోపాటు మరో ఇతర హీరోలు కూడా వీరిద్దరికీ పోటీ ఇవ్వడానికి ధైర్యం చేశారు.ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలకి పోటీగా  తమిళ్ స్టార్ హీరోయిన్ విజయ్ దళపతి ఆయన నటించిన వారసుడు సినిమాతో వీరిద్దరి రేస్ లో నిలిచాడు.

ఇక ఈ సినిమాని తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించాడు. దీంతో ఈ సినిమాపై తెలుగులో కూడా హై క్రియేట్ అయింది. సంక్రాంతి సీజన్ లో కేవలం తెలుగు సినిమాలకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్మాతల మండలి తీర్మానించగా వారసుడు సినిమాపై వివాదం కొనసాగుతోంది. ఇక ఈ సినిమా చేయడానికి సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అదే రోజున నరసింహ నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి విడుదల కానుంది. దాని మరుసటి రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన  వాల్తేరు వీరయ్య సినిమా కూడా విడుదల కానుంది. అయితే ఈ టైప్ హీరోల నేపథ్యంలో  విజయ వారసుడు సినిమాపై హైప్ పెంచేందుకు నిర్మాత దిల్ రాజు ఇప్పుడు అదిరిపోయే ప్లాన్ వేసాడని సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి.

అయితే వారసుడు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని  చీఫ్ గెస్ట్ గా పిలిచేందుకు దిల్ రాజు ప్లాన్ చేశాడని వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే దిల్ రాజు మరియు పవన్ మద్యం మంచి బాండింగ్ ఉంది అన్న సంగతి మన అందరికీ తెలిసింది. ఈ కారణంగా పవన్ కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది .అయితే ఒకవేళ ఇదే గనక నిజమైతే తమిళ్ సూపర్ స్టార్ విజయ్ దళపతిని మరియు తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే స్టేజిపై చూసేందుకు వీరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. దీంతో వారసుడు సినిమాపై క్రియేట్ అయ్యే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: