ఇటీవల విడుదలై త్రిబుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ గ్లోబల్ గుర్తింపు దక్కించుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క సినిమా తోనే వీరిద్దరూ ఇంటర్నేషనల్ లెవెల్ లో అందరి అభినందనలను పొందరు. ఈ సినిమా విడుదల ఇండియాలో ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దాని తర్వాత ఎప్పుడైతే నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదలైందో అప్పటినుండి అంతర్జాతీయ స్థాయికి చేరింది . ఈ సినిమా.అంతేకాకుండా హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ సినిమాని మెచ్చుకోవడం జరిగింది.
అంతే కాదు తాజాగా ఈ సినిమా గోల్డెన్ గ్లోబల్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యింది. అయితే తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికీ మరో అరుదైన గౌరవం దక్కింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. యూకే సౌత్ సెలబ్రిటీ లిస్టులో వీరిద్దరూ స్థానం సంపాదించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇద్దరు ఆ లిస్టులో స్థానం సంపాదించుకోవడమే కాకుండా మొదటి ప్లేస్ లో ఉన్నారు. యూకే బెస్ట్ న్యూస్ పేపర్ అనే ఒక న్యూస్ పేపర్ ప్రచురించి ఈ లిస్టులో ఇద్దరు సెలబ్రిటీలు... సెలబ్రిటీల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉన్నారు.
వీరిద్దరితో పాటు ఈ సినిమాలో నటించిన అలియా భట్ కూడా ఈ లిస్టులో ఉంది. అదేవిధంగా ఈ లిస్టులో స్టార్ హీరో యశ్ ఆరవ స్థానంలో.. అల్లు అర్జున్ పదవ స్థానంలో ఉన్నారు. ఇక వీరితోపాటు ఈ లిస్టులో బిగ్ బాస్ ఫేమ్ తేజస్వి ప్రకాష్ కూడా ఉండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సినిమా అనంతరం ఆర్సి15 సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఇక జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ సినిమా షూటింగ్ పట్టా లెక్కించడంలో ఉన్నాడు.. అయితే మొత్తంగా ఇద్దరూ ఇంతటి పాపులారిటీని దక్కించుకోవడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు...!!