బాలకృష్ణ శ్రీదేవి తో నటించకపోవడానికి ఆయనే కారణమా..!?

Anilkumar
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ మరియు అందాల తార శ్రీదేవి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే వారి అభిమానులకు పండగే. వేటగాడు సినిమాతో మొదటిసారిగా  ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చింది. ఈ సినిమాలో శ్రీదేవి నటనతో అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఇక ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ కి జయసుధ, జయప్రద, శ్రీవాణి వంటి హీరోయిన్లు ఆయన పక్కన నటించేవారు. అప్పుడు శ్రీదేవి కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ వేటగాడు సినిమాలో శ్రీదేవి ఉంటే బాగుంటుంది అని ఈ సినిమాను తీశారట. 

అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ పై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ రాఘవేంద్రరావు మాత్రం ఈ సినిమాని తెరకెక్కించకుండా ఉండలేదు. కానీ సినిమా విడుదలయ్యాక వీరిద్దరి కాంబినేషన్ కి జనాల నోట మాట రాకుండా అయిపోయింది. ఇక ఈ సినిమా అనంతరం చాలా సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. దాంతో వీరిద్దరి జోడి కి మంచి మార్కులే పడ్డాయి. దాని తర్వాత రాఘవేంద్రరావు శ్రీదేవి మరియు అక్కినేని నాగేశ్వరరావు తో ప్రేమ కానుక అలాగే నాగార్జున శ్రీదేవితో ఆఖరిపోరాటం సినిమాలకు దర్శకత్వం వహించడం జరిగింది .అయితే ఈ నేపథ్యంలోనే చాలామంది అభిమానులు నందమూరి బాలకృష్ణ సినిమాలో శ్రీదేవిని హీరోయిన్గా ఎప్పుడు తీస్తారు అంటూ అప్పుడు అడగడం కూడా జరిగింది.

 అయితే 1991లో నందమూరి బాలకృష్ణ మరియు శ్రీదేవి కాంబినేషన్లో ఒక సినిమా చేయాలని అనుకున్నారట. ఆ విషయాన్ని ఆ అఫీషియల్ గా  కూడా అనౌన్స్ చేశారు. కానీ దాని తర్వాత ఏమైందో తెలియదు గానీ ఈ సినిమా గురించి రకరకాల వార్తలు రావడం జరిగాయి. మే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని అందరూ అనుకున్న సమయంలో ఈ సినిమా ప్రారంభం దశలోనే ఆగిపోయిందట. దాని తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేయడానికి ఏ దర్శక నిర్మాతలు కూడా రాలేదు. ఇక బాలకృష్ణ మరియు శ్రీదేవి కాంబినేషన్లో సినిమా రాకపోవడానికి సీనియర్ ఎన్టీఆర్ ముఖ్య కారణం అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే అప్పట్లో ఎన్టీఆర్ వీరిద్దరి కాంబినేషన్లో సినిమాని ఎందుకు ఆపారో ఇప్పటివరకు తెలియదు గానీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని వీరి అభిమానులు ఎంతో ఎదురుచూశారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: