కిక్ సినిమాను వదులుకున్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు ?
రవితేజ హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. రవితేజ నటించిన కిక్ సినిమా ఎంతటి అద్భుత విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇప్పటికీ కూడా టీవీ లో వచ్చిన ప్రతీసారి కిక్ మూవీ మంచి రేటింగ్స్ తో దూసుకుపోతుంది.. అంత పెద్ద బ్లాక్‌బస్టర్ గా నిల్చింది ఈ సినిమా .కిక్ కోసం ఏదైనా చేసే పాత్రలో మాస్ మాహరాజు రవితేజ అద్భుతంగా నటించాడు..సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేసుకుంది.రవితేజ కెరీర్‌లో ఈ రోజుకు కూడా లాభాల పరంగా కానీ.. మార్కెట్ పరంగా కానీ చూసుకుంటే అతడి టాప్ సినిమాల్లో కిక్ ఒకటిగా నిలిచింది. అప్పట్లోనే 30 కోట్ల వరకు వసూలు చేసి రవితేజ రేంజ్ ఏంటో ఈ చిత్రం నిరూపించింది. కిక్ సినిమా 2009 మే 8 న రిలీజ్ అయింది. అప్పటికే అతిథి , అశోక్ లాంటి ఫ్లాపులతో వెనకబడిపోయిన సురేందర్ రెడ్డి కిక్ సినిమా కథ సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమా ఒప్పించడానికి చాలా మంది హీరోల చుట్టూ తిరిగాడు. కానీ చాలా మంది దీన్ని రిజెక్ట్ చేసారు.