తమిళ
సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి
విజయ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
విజయ్ ఇప్పటికే ఎన్నో
బ్లాక్ బస్టర్ మూవీ లలో
హీరో గా నటించి
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తలపతి
విజయ్ "వారిసు" అనే
తమిళ మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ ని తెలుగు లో వారసుడు అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం
పొంగల్ కానుకగా ఈ
మూవీ ని విడుదల చేయనున్నారు.
ఈ
మూవీ కి తెలుగు దర్శకుడు
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ
మూవీ ని నిర్మిస్తున్నాడు.
రష్మిక మందన ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,
తమన్ ఈ
మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం రెండు పాటలను విడుదల చేయగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి వచ్చింది. ఈ
మూవీ నుండి మూడవ పాటను కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ
మూవీ యూనిట్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడవ పాటకు
తమన్ సంగీతం అందించగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ పాటను పాడినట్లు తెలుస్తుంది.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ యొక్క
ఆడియో ఫంక్షన్ ను
డిసెంబర్ 24 వ తేదీన భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ యొక్క
ఆడియో వేడుకను
డిసెంబర్ 28 వ తేదీన కానీ ,
డిసెంబర్ 29 వ తేదీన కానీ నిర్వహించే ఆలోచనలో
మూవీ యూనిటీ ఉన్నట్లు తెలుస్తోంది.