ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఇప్పటికే అనేక బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పుష్ప ది రైస్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో పుష్ప ది రూల్ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో దర్శకుడి మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా చూపిస్త మామ , నేను లోకల్ , హలో గురు ప్రేమ కోసమే మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకున్న త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో అల్లు అర్జున్ నటించ బోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇప్పటికే త్రినాధ్ రావు నక్కిన , అల్లు అర్జున్ కు ఓ కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చిన అల్లు అర్జున్ వెంటనే త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా త్రినాధ్ రావు నక్కిన "ధమాకా" మూవీ కి దర్శకత్వం వహించాడు. రవితేజ హీరో గా నటించిన ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గ నటించింది. ఈ మూవీ డిసెంబర్ 23 వ తేదీన విడుదల కాబోతుంది.