OTT లపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ..!
అంతేకాదు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా తన కమర్షియల్ యాడ్స్ కి పనిచేస్తున్న బాలకృష్ణ డబ్బు పరంగా కూడా బాగానే వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈయన సినిమాల విషయానికి వస్తే ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈయన ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా తో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి బరిలో పోటీ పడబోతోంది. ఇదిలా ఉండగా ఈ క్రమంలోనే బాలయ్య ఓటీటీ లపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా ఏ సినిమా అయినా సరే విడుదలైన రెండు వారాలు లేదా నాలుగు వారాలలోపే ఓటీటీ లోకి వస్తుండడంతో థియేటర్ యాజమాన్యాలు నష్టపోతున్నాయని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలకృష్ణ కూడా మీడియాతో మాట్లాడుతూ ఓటీటిలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటిటి అనేది సినిమాకి అతిపెద్ద పోటీ అలాగే రిపీట్ ఆడియన్స్ ని కూడా చంపేస్తోంది అంటూ తెలిపారు. మొత్తానికైతే ఓటీటీ గట్టి పోటీ ఇస్తుండడంతో థియేటర్లలో సినిమాలు ఎక్కువ రోజులు ఆడడం లేదు అని కూడా స్పష్టం అవుతుంది.