పవన్ కళ్యాణ్ ఆర్థిక విషయాలపై నోరు విప్పిన.. నాగబాబు..!
ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ భారీగా సంపాదించిన హీరో అని .. కానీ పవన్ తర్వాత ఆ స్థాయిలో సంపాదించిన వ్యక్తి వద్ద వందల కోట్ల రూపాయలు ఉంటే .. పవన్ కళ్యాణ్ దగ్గర ఒక పైసా కూడా లేదని నాగబాబు చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారిపోయాయి. ఇకపోతే సినిమా రంగంలోకి పవన్ వచ్చిన కొత్తలో ప్లాన్ ఏంటని అడిగితే.. ఏడాదికి ఒకటో రెండో క్వాలిటీ వున్న సినిమాలు చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పాడు అని నాగబాబు కామెంట్లు చేశారు. ఆ సమయానికి చిరంజీవి అన్నయ్య ఏడాదికి ఐదు సినిమాలు చేస్తున్నాడని. నువ్వు కూడా అలా చేయొచ్చు కదా అని అడిగితే క్వాలిటీ లేని సినిమాలు 100 చేసినా ప్రయోజనం లేదు అని తనతో చెప్పాడని నాగబాబు తెలిపాడు.
అంతేకాదు ప్రేక్షకులు మెచ్చే విధంగా క్వాలిటీ వుండే సినిమాలు 20 చేస్తే చాలు కదా అని పవన్ తనతో అన్నట్టు నాగబాబు వెల్లడించారు. అందుకే సినిమాలు లిమిటెడ్ గా చేస్తున్నాడు అని నాగబాబు వెల్లడించారు మరొకవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఈ నాలుగు సినిమాలలో హరిహర వీరమల్లు స్ట్రెయిట్ సినిమా కాగా.. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.