మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ తాజాగా ధమాకా అనే పక్కా మాస్ కమర్షియల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గ నటించగా బీమ్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని పాటలను విడుదల చేసింది. ఆ పాటలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటికే కొన్ని పాటలను విడుదల చేయగా , అందులో జింతాక్ సాంగ్ కి మాత్రం ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సాంగ్ ను చిత్ర బృందం చాలా రోజుల క్రితమే విడుదల చేసినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ సాంగ్ యూట్యూబ్ లో ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.
ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఈ సాంగ్ లు 28 మిలియన్ న్యూస్ , 251 కే లైక్స్ లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ధమాకా మూవీ యూనిట్ ఈ మూవీ ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది. మరి ఇప్పటికే ఈ సంవత్సరం ఖిలాడి , రామారావు అన్ డ్యూటీ మూవీ లతో ప్రేక్షకులను నిరాశపరచిన రవితేజ ఈ మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.