ప్రస్తుతం
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతూ ఫుల్ ఫాంలో వున్నాడు.గత కొంతకాలం నుంచి మహేష్ పట్టిందల్లా టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లతో
బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.
భరత్ అను నేను
సినిమా నుంచి మొన్న వచ్చిన సర్కారు వారి పాట
సినిమా దాకా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపించాయి.ప్రతి
సినిమా కూడా 200 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. ఇది పక్కా మహేష్ క్రేజ్ కి నిదర్శనం అని చెప్పవచ్చు.ఇక ప్రస్తుతం మహేష్ బాబు
త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28 వ
సినిమా చేస్తున్నాడు.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ
మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.ఈ
మూవీ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ జోనర్‌లో తెరకెక్కుతోంది. ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైంది. ఈ
సినిమా ఫస్ట్ షెడ్యూల్‌లో పవర్ ప్యాకెడ్ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు.
ఈ పార్ట్ మొత్తం చాలా బాగా వచ్చినట్లు తెలిసింది. ఇక, దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను
జనవరి నెల మొదటి వారం నుంచి మొదలెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ
మూవీ నుంచి ఓ సూపర్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ -
సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో చాలా కాలం తరువాత రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని వైవిధ్యమైన కథతో పాన్ రూపొందిస్తున్నారట. ఇందులో భాగంగానే చాలా మంది వేరే ఇండస్ట్రీలకు చెందిన యాక్టర్ లను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాలో మహేశ్ బాబు తల్లిగా
బాలీవుడ్ హాట్
హీరోయిన్ రాణి ముఖర్జీని తీసుకున్నట్లు సమాచారం తెలిసింది. ఎంతో హుందాగా ఉండే ఈ పాత్రకు ఆమె బాగా సెట్ అవుతుందని గురూజీ ఆమెను ఎంపిక చేశారనే సమాచారం వినిపిస్తోంది.