"ధమాకా" మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ తాజాగా ధమాకా అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో యంగ్ బ్యూటీ శ్రీ లీల , రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే ధమాకా మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా ముగించినట్లు తెలుస్తోంది. ధమాకా మూవీ కి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలుసుకుందాం.


ధమాకా మూవీ కి నైజాం ఏరియాలో 5.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి సీడెడ్ లో 2.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఆంధ్ర లో 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ 16 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కలిపి ఈ మూవీ కి 2.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 18.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఈ మూవీ 19 కోట్ల షేర్ కలక్షన్ లను కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా సాధించినట్లు అయితే ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: