బాహుబలి సినిమాతో పాన్
ఇండియా రేంజ్ పాపులారిటీని అందుకున్న
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
బాహుబలి పార్ట్ 1,2 సినిమాలతో పాన్
ఇండియా రేంజ్ క్రేజ్ దక్కినప్పటికీ దాని అనంతరం
ప్రభాస్ హీరోగా వచ్చిన
సాహో మరియు రాధేశ్యామ్ సినిమాలు మాత్రం అంతటి విజయాన్ని దక్కించుకోలేకపోయాయి. ఈ రెండు సినిమాలు అంతటి విజయాన్ని అందుకోకపోవడంతో
ప్రభాస్ క్రేజ్ కొద్దిగా తగ్గింది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు
ప్రభాస్ నటిస్తున్న
ఆది పురుష్
సినిమా త్వరగా విడుదల అయితే మాత్రం ఈ
సినిమా కూడా
బాహుబలి రేంజ్ సక్సెస్ను అందుకోదు ఏమో అంటూ ఆయన అభిమానులు అంటున్నారు.
అయితే ఈ కారణంగానే ఆదిపురుష్ సినిమాని 2024లో విడుదల చేయాలని అనుకుంటున్నారు చిత్రబృందం. అంతేకాదు
ప్రభాస్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులు విడుదల అయ్యేంతవరకు
ఆది పురుష్
సినిమా విడుదల అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక
బాహుబలి సినిమాతో పాన్
ఇండియా క్రేజ్ పొందిన
ప్రభాస్ ఆ ఇమేజ్ ని అలాగే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో అభిమానులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయన ఇప్పుడు నటిస్తున్న
ఆది పురుష్ సినిమాతో రిస్క్ తీసుకోకపోవడం మంచిది అని అంటున్నారు.
ఇటీవల ఈ
సినిమా నుండి విడుదలైన ఫోటోలు మరియు వీడియోలు చూసిన అనంతరం ఈ సినిమాకి సంబంధించి
గ్రాఫిక్స్ ను పూర్తిస్థాయిలో
మార్చి ఈ సినిమాను విడుదల చేయాలని అంటున్నారు
ప్రభాస్ అభిమానులు. ఇక ఈ విషయంపై ఆదిపురుష్ టీం ఎప్పటికీ స్పందిస్తుందో చూడాలి. ఇక ఈ
సినిమా అవుట్ పుట్ విషయంలో ఓం రౌత్ పై ప్రభాస్ అభిమానులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఆయన అభిమానులు
ప్రభాస్ ఎంతో విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు అంటూ చెబుతున్నారు. అంతేకాదు
బాలీవుడ్ డైరెక్టర్ల సినిమాలలో నటించవద్దని
ప్రభాస్ కి సజెషన్స్ కూడా ఇస్తున్నారు ఆయన అభిమానులు.
బాహుబలి సినిమాలాంటి రేంజ్ సినిమాలను తీయాలని అంతటి రేంజ్ ని మళ్లీ పొందాలని
ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు..!!