పసివాడి ప్రాణం సినిమాలో.. చిరంజీవితో నటించిన చిన్నారి ఎలా ఉందో తెలుసా?
గతంలో చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమాలో చిన్నప్పటి చిరంజీవిగా నటించిన తేజ సజ్జ ఇక ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే మెగాస్టార్ కెరియర్ లో మర్చిపోలేని చిత్రం పసివాడి ప్రాణం. చిరంజీవి వన్ మ్యాన్ షో గా నడిచిన ఈ సినిమా ఇక సూపర్ హిట్ సాధించింది అని చెప్పాలి. ఒక చిన్న బాబు కోసం మెగాస్టార్ చేసే సాహసాలు ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాకు అప్పట్లో మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి అందించిన సంగీతం అయితే ప్రేక్షకులను కన్నీరు పెట్టించింది అని చెప్పాలి.
ఈ సినిమా మొత్తం ఒక చిన్న బాబు చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ పాత్ర పేరే రాజా. అయితే ఇలా ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన రాజా పాత్రలో నటించిన చిన్నారి ఎవరు.. ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఒకప్పుడు చిరంజీవి సరసన మాటలు రాని చిన్నారిగా చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన చిన్నారి ఎవరో కాదు సుజిత. ప్రస్తుతం ఆమె టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. కొన్ని సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించారు. జై చిరంజీవ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో కూడా నటించారు సుజిత.