సాధారణంగా సినీ రంగంలో స్టార్ హీరోలు వారి వారసులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక అలాంటి వారిలో స్టార్ కిడ్ గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హాట్
బ్యూటీ శృతిహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. దాని అనంతరం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈమె. సినిమాలతోనే కాకుండా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలలో కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.
అయితే మొదటగా సింగర్ గా పరిచయమైన ఈమె దాని అనంతరం ఎన్నో ఆల్బమ్‌లను క్రియేట్ చేసింది.ఇక తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం స్టార్ హీరోలు మరియు సీనియర్ హీరోలు అని తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తుంది. మొదట్లో వరుస సినిమాలు చేసినప్పటికీ దాని తరువాత కొంచెం గ్యాప్ తీసుకుంది. మళ్లీ ఇప్పుడు రియంట్రీ ఇచ్చిన
శృతిహాసన్ సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె సలార్ మరియు బాలకృష్ణతో హీరోయిన్గా వీరసింహారెడ్డి మరియు
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి.
అయితే ఈ నేపథ్యంలోనే
శృతిహాసన్ డూడల్ ఆర్టిస్ట్ అయిన శాంతను తో ప్రేమలో ఉన్నానని ఆమె సోషల్
మీడియా వేదికగా చెప్పడం జరిగింది.దీనికిగాను వారిద్దరికీ సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఆమె సోషల్
మీడియా వేదికగా పంచుకుంటూనే ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో వారిద్దరికీ బ్రేకప్ అయింది అని వార్తలు సైతం రావడం జరిగింది. ఇక తాజాగా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ
శృతిహాసన్ వారిద్దరూ కలిసి బాగా క్లోజ్ గా ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది. ఇక ఇందులో వీళ్ళిద్దరూ బెడ్ రూమ్ లో ఉండగా... శాంతను
శృతిహాసన్ ని వెనుక నుండి హగ్ చేసుకుని కనిపిస్తున్నాడు. దీనికిగాను
శృతిహాసన్ నాకు కావాల్సింది కూడా ఇదే అని ఆ ఫోటో కింద క్యాప్షన్ కూడా రాసింది. దీంతో మీ ఇద్దరికీ బ్రేకప్ కాలేదు అని క్లారిటీ వచ్చింది..!!