ఇప్పటికే ఎన్నో
బాలీవుడ్ బ్లాక్ బస్టర్
మూవీ లలో నటించి
హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న
బాలీవుడ్ బాధ్ షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా
ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే షారుక్ ఖాన్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నా
షారుఖ్ ఖాన్ ప్రస్తుతం మాత్రం వరుస ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్
జోష్ లో ముందుకు సాగుతున్నాడు.
అందులో భాగంగా ముందుగా షారుక్ ఖాన్ "పఠాన్'
మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని వచ్చే సంవత్సరం
జనవరి 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ
మూవీ యూనిట్ ప్రకటించింది. దీపికా పదుకొనే ఈ మూవీలో
హీరోయిన్ గ నటిస్తూ ఉండగా , జాన్ అబ్రహం ఈ
మూవీ లో ఒక ముఖ్యమైన కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
అలాగే ఈ
మూవీ ఇప్పటికే కొన్ని వివాదాలు కూడా చిక్కుకుంది ఆ వివాదాల ద్వారా కూడా ఈ
మూవీ ఈ మధ్య వార్తలు నిలుస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి అద్భుతమైన డిజిటల్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ
మూవీ "ఓ టి టి" హక్కులకు
అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ 100 కోట్ల ఆఫర్ చేసినట్లు , దానితో ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా డిజిటల్ హక్కులను
అమెజాన్ ప్రైమ్ సంస్థకు అమ్మివేసినట్లు తెలుస్తోంది. మరి క్రేజీ
మూవీ పఠాన్
మూవీ తో షారుక్ ఖాన్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.