ఆంధ్రవాలా ప్లాప్ అవ్వడానికి కారణం అదేనా...?
అప్పుడే పూరి జగన్నాథ్ దర్శత్వంలో ఆంధ్రా వాలా సినిమాకు ఓకే చెప్పాడట ఎన్టీఆర్ . ఈ చిత్రంలో అతడు డ్యూయల్ రోల్ కూడా చేశాడు. రక్షిత హీరోయిన్ గా ఎన్టీఆర్ సరసన నటించిన ఆంధ్రావాలా సినిమా 2004 లో ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చింది. కానీ భారీ అంచనాల తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ ప్లాప్ గా మిగిలింది.
సింహాద్రి సినిమా స్థాయిలో లో ఉంటుందని థియేటర్ కి వెళ్ళిన ప్రేక్షకుడికి నిరాశ అయితే తప్పలేదు. ఇక ఈ చిత్రంలో మొదటి సారి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన అస్సలు వర్క్ ఔట్ అవ్వలేదు. కానీ అప్పట్లో హరికృష్ణ కొడుకు గా జూనియర్ ఎన్టీఆర్ కి మంచి మార్కెట్ అయితే ఉంది. krishna TELGU ACTOR' target='_blank' title='హరి కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">హరి కృష్ణ సైతం హీరో గా సినిమాల్లో రానిస్తున్నారు.
అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ నటించడం కన్నా krishna TELGU ACTOR' target='_blank' title='హరి కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">హరి కృష్ణ గారు కనుక నటించి ఉంటే ఈ సినిమా ఫలితం కూడా వేరేలా ఉండేది అని ట్రేడ్ వర్గాలు కూడా భావించాయి. అలాగే ఇద్దరినీ ఒకేసారి తెరపై చూసుకునే అవకాశం కూడా నందమూరి అభిమానులకు దక్కేది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలింది.. వాస్తవానికి ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి. చక్రి అందించన మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కానీ మితిమీరిన హైప్ క్రియేట్ అవ్వడం తో ఆ అంచనాలు అయితే అందుకోవడం లో విఫలం అయిందట ఆంధ్ర వాలా చిత్రం.
పూరి జగన్నాథ్ సైతం అప్పటికే హ్యాట్రిక్ విజయాలను దక్కించుకోవడం కూడా కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ గా వున్నాడు.. 2004 లో 14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం సంగం వసూళ్లు కూడా రాబట్ట లేకపోయింది. ఇక ఈ సినిమా కన్నడ లో పునీత్ రాజ్ కుమార్ హీరో గా మెహర్ రమేష్ దర్శకత్వంలో విడుదల అయ్యి అక్కడ మంచి విజయాన్ని అయితే నమోదు చేసింది.