హ్యాపీ బర్తడే: సల్మాన్ ఖాన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
ఇకపోతే 1965 డిసెంబర్ 27వ తేదీన జన్మించిన సల్మాన్ ఖాన్ తాజాగా 57వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రముఖ భారతీయ నటుడిగా, నిర్మాతగా, టీవీ నటుడిగా ఆసియాలోనూ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో కూడా బాగా గుర్తింపు పొందిన నటుడు అని చెప్పవచ్చు. ఈయన అసలు పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్. బీవీ హో తో ఐసి అనే సినిమా ద్వారా 1988లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైనా.. ఆ తర్వాత సూరజ్ బర్జత్య దర్శకత్వంలో 1989లో వచ్చిన మైనే ప్యార్ కియా సినిమా ద్వారా హీరోగా మారారు.
ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఫిలింఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 2000 - 2010 మధ్యకాలంలో సినీ కెరియర్ కు పెద్దగా కలిసి రాకపోయినా 2010లో వచ్చిన దబాంగ్ సినిమాతో మళ్ళీ హిట్ బాట పట్టారు. ఆ తర్వాత ఆయన నటించిన బాడీగార్డ్ , ఏక్ థా టైగర్, బజరంగీ భాయిజాన్, సుల్తాన్ వంటి సినిమాలతో బాలీవుడ్ లోనే ఎక్కువ వసూలు సాధించిన సినిమాలను కూడా ఆయన ఇండస్ట్రీకి అందించారు. అంతేకాదు 2014లో ఫోర్స్ భారత్ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న 2015 జాబితాలో 33.5 మిలియన్ డాలర్లు తీసుకుంటూ ప్రపంచ టాప్ పెయిడ్ ఎంటర్టైనర్స్ 2015 గా నిలిచాడు.