మాస్ మహారాజా
రవితేజ తాజాగా ధమాకా అనే
రొమాంటిక్ కామెడీ
మాస్ ఎంటర్టైనర్
మూవీ లో
హీరో గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
మూవీ లో
పెళ్లి సందD
బ్యూటీ శ్రీ లీల
హీరోయిన్ గా నటించగా , బీమ్స్ ఈ
మూవీ కి సంగీతం అందించాడు. ఈ
మూవీ మంచి అంచనాల నడుమ
డిసెంబర్ 23 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది.
దానితో ఈ
మూవీ కి ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ
మూవీ 4 రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో ఈ
మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. 4 రోజుల్లో ధమాకా
మూవీ నైజాం ఏరియాలో 7.41 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , సీడెడ్ లో 2.84 కోట్లు , యూ ఏ లో 2.04 కోట్లు , ఈస్ట్ లో 88 లక్షలు , వెస్టులో 71 లక్షలు , గుంటూరులో 1.6 కోట్లు , కృష్ణ లో 95 లక్షలు , నెల్లూరులో 51 లక్షలు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ
సినిమా 16.40 కోట్ల షేర్ కలక్షన్ లను , 29.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిసి 1.40 కోట్లు. ఓవర్సీస్ లో 1.02 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 4 రోజులకు గాను ధమాకా
మూవీ 18.82 కోట్ల షేర్ కలెక్షన్ లను , 35.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ధమాకా
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది.