మాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం క్రాక్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. అలా క్రాక్ మూవీ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ అనేక మూవీ లకు సైన్ కూడా చేశాడు. అందులో భాగంగా రవితేజ క్రాక్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ఖిలాడి అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయింది.
ఆ తర్వాత రామారావు అన్ డ్యూటీ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇలా వరుస పరాజయాలతో డీలా పడిపోయిన రవితేజ తాజాగా ధమాకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీ లీల ఈ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా నటించగా ... త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 23 వ తేదీన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది.
ఈ మూవీ కి ప్రస్తుతం అద్భుతమైన రేంజ్ కలెక్షన్ లు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా ఈ మూవీ కి ఓవర్సీస్ లో కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా ఓవర్సీస్ లో 250 కే డాలర్ లను వసూలు చేసినట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని ఓవర్సీస్ లో రెడ్ హార్ట్ మూవీ సంస్థ విడుదల చేసింది. ఈ మూవీకి ఓవర్సీస్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతమైన కలెక్షన్లు లభిస్తున్నాయి.