మహేష్ సినిమా కథని పూర్తిగా మార్చేసిన త్రివిక్రమ్.. కారణం అదేనా..!?

Anilkumar
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల మహేష్ ఇంట్లో జరిగిన విషాదాల కారణంగా ఎంతో కృంగిపోయిన మహేష్ సినిమా షూటింగ్ లకి కొంచెం గ్యాప్ ఇచ్చారు. మహేష్ బాబు కుటుంబంలో ఒకరి వెంట ఒకరు చనిపోవడంతో మహేష్ బాబు ఎంతో కృంగిపోయాడు. ఇక వీటన్నింటి నుండి బయటకు రావడానికి మహేష్ బాబు ఆయన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళాడు. వీలైనంత త్వరగా విదేశాల నుండి తిరిగివచ్చి తన తదుపరి సినిమాల షూటింగ్ పనులను మొదలుపెట్టనున్నాడు. ఇక ఇప్పటికే త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.

ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడిగా బుట్ట బొమ్మ పూజ హెగ్డే నటిస్తోంది. అయితే త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో రానున్న ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం. ఇక త్రివిక్రమ్ ఈ సినిమాను ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు ముందుగా త్రివిక్రమ్ మహేష్ కోసం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కథను అనుకున్నారట.కానీ మహేష్ బాబు కోసం అనుకున్న ఈ కథలో చాలా మార్పులను చేశాడట త్రివిక్రమ్. దాని అనంతరం ఈ సినిమాను కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది.

ఇక త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన షూటింగ్ పనులను కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది. అంతేకాదు మహేష్ బాబు మరియు పూజ హెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమా చాలా సింపుల్ గా ఉంటుందని దాంతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఎంతో ఇష్టపడతారు అని తెలుస్తుంది. సాధారణంగా కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట త్రివిక్రమ్. దాంతో పాటు ఈ సినిమాలో ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుందని బావ మరదలు మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో ఈ సినిమాలో త్రివిక్రమ్ చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి త్రివిక్రమ్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా ఈ కథను తీర్చిదిద్దినట్లుగా తెలుస్తోంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: