బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నేటితో 57వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.దీంతో ఈ రోజు సల్మాన్ ఖాన్ కి అభిమానులు నుంచి, సినీ ప్రముఖుల నుంచి చాలా రకాలుగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అన్ని సోషల్ మీడియా అకౌంట్లలో కూడా సల్మాన్ ఖాన్ పుట్టినరోజుకి సంబంధించి తెలిపిన శుభాకాంక్షలు పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో వెంకటేష్ కూడా సల్మాన్ ఖాన్ ని విష్ చేయడం జరిగింది. ఇక నిన్న రాత్రి సల్మాన్ ఖాన్ సోదరి తన ఇంటిలో ఒక గ్రాండ్ పార్టీని కూడా ఇవ్వడం జరిగింది.ఈ పార్టీలో బాలీవుడ్ లోని పలువురు ఫేమస్ స్టార్స్ అందరూ కూడా పాల్గొని ఎంతగానో సందడి చేయడం జరిగింది.ఇక ఈ పార్టీకి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా హాజరవ్వడం జరిగింది.
సల్మాన్ ఖాన్ తో కలిసి షారుఖ్ ఖాన్ ఒక చోట కనిపించడం ఇద్దరి అభిమానులకు కన్నుల పండగలా ఉంది. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ఇంకా అలాగే వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారడంతో.. ఫ్యాన్స్ వాటిని లైక్లు ఇంకా షేర్లు చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా సినిమాలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.ఈ పార్టీకి పూజ హెగ్డే, జాన్వీ కపూర్, టబు, సోనాక్షి సిన్హా, సునీల్ శెట్టి, రితేశ్, జెనీలియా ఇంకా అలాగే కార్తీక్ ఆర్యన్.. మరికొందరు సెలెబ్రెటీస్ అందరూ కూడా ఈ పార్టీలో సందడి చేయడం జరిగింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ అజిత్ సినిమా వీరమ్ కి రీమేక్ అయిన 'కిసికా భాయ్ కిసికి జాన్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒక పాత్ర చేస్తున్నాడు. ఇంకా అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక పాటలో సల్మాన్ అలాగే వెంకటేష్ తో కలిసి కూడా చిందేయనున్నాడు.