బాలయ్య షోలో పవన్ కళ్యాణ్.. షూటింగ్ ఎప్పటినుంచంటే..?

Divya
నటసింహ బాలకృష్ణ ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ భారీ యాక్షన్ ఫిలిమ్స్ ద్వారా అత్యధిక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన అఖండ సినిమాతో అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా కొత్త హీరోలకు కూడా షాక్ ఇచ్చారు. ఇప్పుడు రవితేజకు గత ఏడాది క్రాక్ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందించిన గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేస్తున్నారు బాలకృష్ణ . ఆ సినిమానే వీరసింహారెడ్డి.. జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఒంగోలులో జనవరి 6న సాయంత్రం 6:00 గంటల నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.

అయితే ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా రాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలయ్య ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు అన్ స్టాపబుల్ లాంటి సెలబ్రిటీ టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టాక్ షో కి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు రాజకీయ ప్రముఖులు కూడా ఈ షో కి వచ్చి ఎన్నో విషయాలను ప్రజలకు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఎప్పుడూ మీడియా ముందుకు రాని రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అతడి స్నేహితుడు గోపీచంద్ తో కలిసి ఈ షో కి హాజరయ్యారు.  ఈ ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుక స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇకపోతే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షోకి రాబోతున్నారని సమాచారం. గతంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరి ఎపిసోడ్ కి వస్తారు అని వార్తలు వినిపించినా.. తాజాగా సమాచారం ప్రకారం ప్రభాస్ ఎపిసోడ్ పూర్తి కాగానే  పవన్ తో  షూటింగ్ ప్రారంభం కాబోతోంది. త్వరలోనే స్ట్రీమింగ్ కూడా చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: