ఐదు రోజుల్లో "ధమాకా" మూవీ సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి మాస్ మహారాజా గా గుర్తింపు సంపాదించుకున్న రవితేజ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ "ధమాకా" అనే రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... త్రినాథ్ రావు నక్కిన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.


ఈ మూవీ డిసెంబర్ 23 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ దక్కడంతో ప్రస్తుతం ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా సూపర్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


మొదటి రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 5.46 కోట్ల షేర్ ,  9.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
రెండవ రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 3.98  కోట్ల షేర్ , 7.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మూడవ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5.93 కోట్ల షేర్ , 11.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
నాలుగవ రోజు ఈ సినిమా 3.55 కోట్ల షేర్ , 6.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఐదవ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2.64 కోట్ల షేర్ ,  5.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మొత్తంగా ఈ మూవీ 5 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా 21.56 కోట్ల షేర్ ... 40.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: