పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్.. కానీ..!

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో బిజీగా ఉండగానే.. మరొకవైపు రాజకీయాలలో కూడా వేగంగా పావులు కదుపుతున్నాడు. ఈ క్రమంలోనే అటు బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కి కూడా గెస్ట్ గా రాబోతున్నారు. అంతేకాదు బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి తో పాటు చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఇన్ని విధాలుగా ఇంత పాపులారిటీ దక్కించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కూడా భారీ అంచనాలను పెంచేస్తోంది.

మరొకవైపు ఈయన గతంలో నటించి భారీ విజయాన్ని అందుకున్న ఖుషి సినిమాను రీ రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.  డిసెంబర్ 31వ తేదీన ఈ సినిమాలో థియేటర్లలో 4కె రూపంలో రీ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్ ఒకటి బయటకు రావడం గమనార్హం. ఇకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులను సంతోషంలో ముంచెత్తడానికి హరిహర వీరమల్లు నిర్మాతలు సరికొత్త ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏమిటంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఖుషి సినిమా రిలీజ్ లో భాగంగా ఒకవైపు సినిమాలు రిలీజ్ చేస్తూనే అదే థియేటర్లలో చివర్లో హరిహర వీరమల్లు సినిమా టీజర్ ని కూడా ప్రదర్శించడానికి అన్ని ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు  ఒకేసారి రెండు ఆనందాలను పంచడం కంటే విడివిడిగా సినిమాపై హైప్ పెంచడం మేలు అని.. ఆలోచించిన  నిర్మాతలు ఖుషి సినిమా రీ రిలీజ్ రోజున హరిహర వీరమల్లు టీజర్ను థియేటర్లలో ప్రదర్శించకుండా మరికొన్ని రోజుల తర్వాత ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.  దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులలో మరింత ఆనందం వెల్లివిరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: