చిరంజీవి-రాజశేఖర్ మధ్య విబేధాలు.. అదే కారణమా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన స్వయంకృషితో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు స్టార్ హీరోగా గుర్తింపును పొందాడు. ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సినిమాలే కాకుండా ఆయన మంచి మనసుతో అనేకమందికి సహాయం కూడా చేస్తాడు మెగాస్టార్ చిరంజీవి. గతంలో రాజకీయాలను కూడా వదిలేసి తన అభిమానుల కోసం తిరిగి సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే గత కొన్ని రోజుల క్రింద చిరంజీవికి మరియు హీరో రాజశేఖర్ కి మధ్య విభేదాలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. 

రాజశేఖర్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టుకోవాలనుకున్నాడు. ఇక ఆ సమయంలో రాజశేఖర్ చేసిన విమర్శల వల్ల మెగాస్టార్ చిరంజీవి అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇక చిరంజీవి రాజకీయాల ప్రవేశం గురించి ఆయన మాట్లాడుతూ రాజకీయాలలో ఎందుకు పనిలోకి రాకుండా పోతాడు అన్నట్లుగా కూడా రాజశేఖర్ చిరంజీవిని విమర్శించడం జరిగింది. దీంతో చిరంజీవి అభిమానులు రాజశేఖర్ ఆయన కుటుంబంతో వెళుతున్న సమయంలో వారిపై దాడి కూడా చేశారు. ఇక దాంతో విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే మరుసటి రోజు

 రాజశేఖర్ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించాడు. దాని అనంతరం ఒక ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవి రాజశేఖర్ కి క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. ఆ సమయంలో ఇంతటితో ఈ గొడవలు అన్నీ అయిపోయాయి అని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ఈ గొడవల ఫలితాలు మాత్రం చాలా రోజులు కొనసాగాయి. దాని అనంతరం చాలా రోజుల తర్వాత మళ్లీ రాజశేఖర్ చిరంజీవిని తన కూతురికి ఎంబీబీఎస్ సీటు కావాలని వెళ్లడట. చిరంజీవి మాత్రం గతంలో జరిగిన విషయాలను ఏమాత్రం  పట్టించుకోకుండా తన కూతురికి ఎంబీబీఎస్లో సీటు ఇప్పించాడు. దీంతో ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది అని నిరూపించారు. ఇప్పుడు ఆ గొడవలన్నీ సర్దుమనిగి ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: