ప్రభాస్ శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు ప్రభాస్ శ్రీను. దాదాపు 300 సినిమాలకు పైగా నటించిన ఈయన ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రభాస్ కి వ్యక్తిగత అసిస్టెంట్ గా ఉన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రభాస్ కి సంబంధించిన సినిమాల విషయాల దగ్గర నుండి అన్ని విషయాలను ప్రభాస్ శ్రీను నీ దగ్గరుండి చూసుకుంటాడు. ఎన్నో సినిమాల్లో ఆయన అద్భుతమైన కామెడీతో ఎందరినో ఆకట్టుకున్న ప్రభాస శ్రీను జోరు ఇప్పుడు కాస్త తగ్గింది
అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన చాలా విషయాలను చెప్పుకొచ్చాడు. అందులో భాగంగానే ప్రభాస్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు ఈయన. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకునే సమయంలో ప్రభాస్ తో నాకు మంచి పరిచయం ఏర్పడిందని.. అప్పటినుండి తనతో కలిసి ప్రయాణిస్తున్నానని ..కృష్ణంరాజు ప్రభాస్ రాజు అని నేను మంత్రి అని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు అని..
ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ప్రభాస్ ఎప్పుడూ ఒకేలాగా ఉంటాడు అని.. స్టార్ స్టేటస్ వచ్చినంత మాత్రాన ఏమాత్రం మారలేదు అని.. చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగానే ప్రభాస్ మంచితనమే ఆయనకు ప్లస్ అని.. ఆయన బలహీనత కూడా అదే అని.. ఆయన చెప్పుకొచ్చాడు. ప్రభాస్ కి కోపం వచ్చిందంటే అసలు ఎవరితో మాట్లాడు అని.. ఆయన ప్రేమ ఎంత అందంగా ఉంటుందో ఆయన మౌనం దానికంటే భయంకరంగా ఉంటుందని.. ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.దీంతో ప్రభాస్ శ్రీను ప్రభాస్ పై చేసిన ఈ కామెంట్లు కాస్త సోషల్ మీడియా వేదికగా వేర్లవుతున్నాయి ..!!