బాలయ్య, చిరంజీవి లతో నటించడంపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రుతిహాసన్..?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా ఈమె మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి నరసింహం బాలకృష్ణ ఇద్దరితోను ఒకేసారి నటించింది. ఇక ఈమె నటించిన రెండు సినిమాలు కూడా ఒకేసారి విడుదలవుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో శ్రీదేవి పాటకి స్టెప్పులేస్తూ కనిపించిన ఈమె అదే సమయంలో సుగుణా సుందరి అంటూ బాలయ్యతో కూడా స్టెప్పులేసింది. ఆరు పదులు వయసు ఉన్న ఇద్దరు స్టార్ హీరోలతో మూడు పదులు వయసు ఉన్న ఈమె నటించడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. 

ఇంత చిన్న వయసులో ఆరు పదులు వయసు ఉన్న స్టార్ హీరోల సరసన నటించినందుకు గాను శృతిహాసన్ మీద అనేకమైన ట్రూల్స్ చేస్తున్నారు చాలామంది.అంతే కాదు దాంతోపాటు చాలామంది  ఈ విషయంపై ప్రశ్నిస్తున్నారు. దీనికిగాను వారందరికీ క్లారిటీ ఇచ్చింది శృతిహాసన్. ఈ నేపథ్యంలోనే తను మాట్లాడుతూ.. చాలామంది స్టార్ నటీనటులకు సంబంధించిన వయసు గురించి మాట్లాడుతున్నారు. యాక్టింగ్ అనేది వయసుతో సంబంధం లేదు.. వయస్సు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే.. సినీ పరిశ్రమలో టాలెంట్ ఉన్నవారు ఏలాంటి పని చేయడానికి అయినా వెనుకడుగు వేయరు..

మంచి టాలెంట్ ఉన్నవారు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును పొందుతారు.. దాంతోపాటు ఏ వయసులో ఉండాల్సిన ఆ అందం ఆ వయసులో ఉంటుంది.. సినిమాల్లో నటించడానికి వయస్సు ఎప్పటికీ అడ్డు రాకూడదు.. సినిమాలు చేయడానికి వయసుతో సంబంధం లేదు.. అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు నేను సినీ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అసలు నన్ను ఎవరూ పట్టించుకునేవారు కాదు.. కానీ ఇప్పుడు నాకు ఒక స్టార్ స్టేటస్ వచ్చిన అనంతరం చాలామంది నా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ..అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్  మొత్తానికి స్టార్ హీరోలతో నటించడానికి వయస్సు ఏమాత్రం కారణం కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది ఈమె..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: