మరో సారి వైరల్ అవుతున్న సమంత పోస్ట్.. ఇదే సరైన సమయం అంటూ..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఏం మాయ చేసావే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈమె నటించిన యశోద సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత తాను మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడినట్టు చెప్పిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇక ఈ వార్త విన్న అనంతరం చాలామంది ఆమె అభిమానులు మరియు సినీ సెలబ్రిటీలు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వ్యాధికి గాను ఆమె విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది అని అనేక రకమైన వార్తలు వస్తున్నాయి. 

కానీ ఇప్పటివరకు ఈ విషయాలపై సమంత మాత్రం స్పందించలేదు. అయితే సమంత ఈ వ్యాధి బారిన పడినప్పటినుండి తనకి సంబంధించిన ఏ ఒక్క సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా లేదు. అయితే చాలా రోజుల తర్వాత నూతన సంవత్సరం వస్తున్న సందర్భంగా తన అభిమానులతో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది సమంత. అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదిక ద్వారా తనకు సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేస్తూ మీరు కంట్రోల్ చేయగలిగిన వాటిని కంట్రోల్ చేయండి కొత్త లక్షల కోసం అలాగే సులభమైన లక్షల కోసం ఇదే సరైన సమయం అని ఆమె చెప్పుకొచ్చింది.

దాంతోపాటు మనకు సాధ్యమయ్యే లక్ష్యాలను ముందే నిర్దేశించుకోమని ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పుకొచ్చింది. దాంతోపాటు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2023 అని చెప్పుకొచ్చింది సమంత. దీంతో చాలా కాలం తర్వాత సమంత సోషల్ మీడియా వేదికగా ఇలాంటి పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సమంత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి  సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా నటిస్తోంది సమంత.ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయినప్పటికీ కొంత షూటింగ్ మిగిలిపోయింది. సమంత ఆరోగ్యం కుదుటపడిన అనంతరం ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన షూటింగ్ పనులను కూడా పూర్తి చేయనున్నట్లుగా తెలుస్తోంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: