టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దిల్ రాజు ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో మూవీ లను నిర్మించడం మాత్రమే కాకుండా ... ఎన్నో మూవీ లకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించి అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా వారిసు ను రూపొందించిన విషయం కూడా మనకు తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే తాను నిర్మించిన మూవీ ని సంక్రాంతి కి విడుదల చేస్తున్న దిల్ రాజు సంక్రాంతి కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూవీ ని కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగి ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ తాజాగా తూనీవు అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ని తెలుగు లో తెగింపు పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని నైజాం మరియు వైజాగ్ ఏరియా లలో దిల్ రాజు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తునివు ఇవ్వు మూవీని వచ్చే సంవత్సరం జనవరి 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.