ట్రైలర్ తో అదరగొట్టేస్తున్న అజిత్.. తెగింపులో స్టైలిష్ లుక్..!

Divya
తాజాగా తమిళ్లో తునివు .. తెలుగులో తెగింపు పేరిట కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజాగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాస్ , యాక్షన్ ఎంటర్టైనర్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ బ్యానర్ తో కలిసి బోనీ కపూర్ భారీ వ్యయంతో నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , సాంగ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ జీబ్రాన్ కంపోజ్ చేసిన పాటలకు ప్రేక్షకులలో విశేష స్పందన లభించింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన తెలుగు, తమిళ్ భాషలలో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా డిసెంబర్ 31వ తేదీన ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రం యూనిట్. ఒక నిమిషం 52 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో బ్యాంకులను లూటీ చేసే వ్యక్తిగా అజిత్ పాత్రను పరిచయం చేశారు. ఇందులో మరింత స్టైలిష్ లుక్కులో చాలా అందంగా కనిపిస్తున్నాడు అజిత్. అలాగే డైలాగ్ ఫైట్ సీన్స్,  యాక్షన్స్ తో పాటు గ్రాండియర్ విజువల్స్,  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.  మొత్తానికి అయితే ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగినప్పటికీ విజయం సాధిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇందులో మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తోంది.  ఇదిలా ఉండగా అజిత్ , హెచ్.వినోద్,  బోనీ కపూర్ కాంబినేషన్లో వచ్చే మూడవ సినిమా ఇది.  గతంలో వీరు ముగ్గురు నెర్కొండ పార్వాయి , వాలిమై వంటి రెండు ప్రాజెక్ట్ లను కంప్లీట్ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఈ త్రయం హ్యాట్రిక్ హిట్టు కొట్టబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: