తెలుగు
సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న నటి మనులలో ఒకరు అయినటువంటి
సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
సమంత కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక
తమిళ మూవీలలో కూడా నటించి తమిళనాట కూడా అద్భుతమైన క్రేజ్ ను ... ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది.
ఇది ఇలా ఉంటే
సమంత కొన్ని రోజుల క్రితమే యశోద అనే లేడీ ఓరియంటెడ్ పాన్
ఇండియా మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని ... మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఈ సంవత్సరం యశోద
మూవీ తో
సమంత బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే
సమంత తాజాగా శాకుంతలం అనే భారీ బడ్జెట్
మూవీ లో కీలకమైన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.
టాలెంటెడ్
డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ
మూవీ లో
మోహన్ బాబు ... దేవ్
మోహన్ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం కొన్ని
పోస్టర్ లను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను విడుదల చేసింది. ఈ
సినిమా బృందం ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ
మూవీ నుండి ఒక బిగ్ అనౌన్స్మెంట్ ను ప్రకటించబోతున్నట్లు సోషల్
మీడియా ద్వారా ప్రకటించింది. మరి శాకుంతలం
మూవీ యూనిట్ ఏ అప్డేట్ ను ప్రకటిస్తుందో అనేది తెలియాలంటే ఈరోజు ఉదయం 11 గంటల వరకు వేచి చూడాల్సిందే.