కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ రిలీజ్ డేట్ లాక్..!
ఇకపోతే బింబిసారా సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నారు కళ్యాణ్ రామ్ . ఇప్పటికే నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ : బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమా చేస్తుండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ మూవీ సెట్ పై ఉండగానే మరో సినిమాను విడుదల కు సిద్ధం చేస్తున్నాడు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ నటించిన మరొక చిత్రం అమిగోస్. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. కళ్యాణ్ రామ్. ఇందులో పారిశ్రామికవేత్త సిద్ధార్థగా కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ లో తెలియజేయడం జరిగింది.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేసింది చిత్ర బృందం. రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను 2023 ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సమాచారం. సంక్రాంతికి ట్రైలర్ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది . మొత్తానికైతే ఒక సినిమా సెట్ మీద ఉండగానే మరొక సినిమాను విడుదల చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు కళ్యాణ్ రామ్.