టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు దర్శకుడు కృష్ణ వంశీ. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సినిమాలను తెరకెక్కించి మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక ఈ దర్శకుడు అలనాటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణతో చంద్రలేఖ సినిమా సమయంలో ప్రేమలో పడి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న కృష్ణవంశీ, రమ్యకృష్ణ దంపతులు ప్రస్తుతం తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఈ దంపతులకు ఓ కొడుకు కూడా జన్మించాడు. ఇక ప్రస్తుతం కెరియర్లో కృష్ణవంశీ దర్శకుడిగా సినిమాలు చేస్తూ వెళ్తుంటే.. రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఆగ్రహీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది. ఇక దర్శకుడుగా కృష్ణవంశీ అప్పటికంటే ఇప్పుడు కాస్త స్పీడ్ తగ్గించినప్పటికీ..
మరికొద్ది రోజుల్లోనే 'రంగమార్తాండ' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన కృష్ణవంశీ.. పలు ఇంటర్వ్యూలలో ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇక రంగమార్తాండ సినిమాలో ప్రకాష్, రాజ్ అనసూయతో పాటు రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే తాజా ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ మరోసారి రమ్యకృష్ణతో విభేదాల గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు కృష్ణవంశీ మాట్లాడుతూ.." ప్రస్తుతం ఇద్దరం కూడా సినిమా పనులతో బిజీగా ఉన్నామని.. అలాగే రమ్యకృష్ణ ప్రస్తుతానికి చెన్నైలో ఉంటుందని, తాను మాత్రం హైదరాబాదులో ఉంటున్నానని చెప్పాడు. అయితే తాము ప్రస్తుతానికి తమ వృత్తిపరంగా విడిగా ఉన్నామే తప్ప ఎటువంటి విడాకులు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు కృష్ణవంశీ.
అంతేకాకుండా ఇలాంటి వార్తలను సృష్టించడం అనేది ఒక శాడిస్ట్ పని. అలాంటి వార్తలను సృష్టించిన వారిని చూస్తే పాపం అనిపిస్తుంది.వాళ్ళు ఇంతకంటే ఎక్కువ ఆలోచన చేయలేకపోతున్నారా? అని అనిపిస్తుందంటూ చెప్తూనే తమ విడాకుల విషయంలో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పేసారు. దీంతో ఎట్టకేలకు ఇన్ని రోజులుగా ప్రచారం అవుతున్న వీరి విడాకులకు సంబంధించిన వార్తలకు పుల్ స్టాప్ పడినట్లు అయింది. ఇక ప్రస్తుతం రమ్యకృష్ణ విషయానికొస్తే.. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలు అందుకుంటూ సౌత్ లోనే టాప్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న సీనియర్ హీరోయిన్గా దూసుకుపోతున్నారు...!!