శాకుంతలం సినిమా విషయంలో కూడా భారీ స్కెచ్ వేసిన దిల్ రాజు..!

Divya
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన ప్రస్తుతం అనతి కాలంలోనే స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తూ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ను ఏర్పాటు చేసి భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తూ తన ప్రొడక్షన్ సంస్థను తెలుగులోనే కాదు ఇతర రాష్ట్రాలకు కూడా పాకేలా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కోలీవుడ్ హీరో విజయ్ తో వరిసు (వారసుడు) చిత్రాన్ని తెరకెక్కిస్తూ అక్కడ కూడా తన నిర్మాణ సంస్థను విస్తరింప చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాకు ఏకంగా రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయించడం గమనార్హం.
తెలుగులో వాల్తేరు వీరయ్య,  వీర సింహారెడ్డి సినిమాలు విడుదలవుతున్నప్పటికీ కూడా వారసుడు సినిమాకు ఎక్కువ థియేటర్ లు  కేటాయించి తెలుగు హీరోలను అవమానపరిచాడనే నిందలు కూడా మోస్తున్నారు. మొత్తానికి అయితే రెండు తెలుగు సినిమాలకు మించి వారసుడు సినిమాకు అటు నైజాం,  ఇటు హైదరాబాద్ వంటి ప్రాంతాలలో కూడా ఎక్కువ థియేటర్ లు కేటాయించడం గమనార్హం.  అయితే ఇప్పుడు ఇదిలా ఉండగా ఆయన మరొక భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఎలాగో సెలవు దినాలలో బాక్సాఫీస్ వద్ద సినిమాలు కళ కళ లాడుతాయి. కాబట్టి కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో వస్తాయి.  ప్రస్తుతం సంక్రాంతికి వరుస సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో శాకుంతలం సినిమా ను రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని ఆలోచించిన దిల్ రాజు శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ముఖ్యంగా మహాశివరాత్రి నాడు వచ్చే సెలవు దినాన్ని ఉపయోగించుకోవడానికి సమంత నటించిన శాకుంతలం సినిమాను విడుదల చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఆయన కలెక్షన్స్ రాబట్టడానికి ఎక్కువగా సెలవు దినాలలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.  మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అని ప్రతి ఒక్కరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  ఇక ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు.. అలాగే సమంత చిన్నప్పటి పాత్రలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: