ఫిబ్రవరి 17వ తేదీన ఎన్ని మూవీలు విడుదల కాబోతున్నాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
శాకుంతలం : అందాల ముద్దుగుమ్మ సమంత ప్రధాన పాత్రలో తేరకేక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో దేవ్ మోహన్ , మోహన్ బాబు కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
దమ్కి : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి విశ్వక్ సేన్ ఈ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో విశ్వక్ సేన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది.
వినరో భాగ్యము విష్ణు కథ : కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ని ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మురళీ కిషోర్ అబ్బోరు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.
సార్ : వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో ధనుష్ హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 17 వ తేదీన విడుదల చేయనున్నారు.