సూపర్ స్టార్ మహేష్ బాబు పోయిన సంవత్సరం విడుదల అయినా సర్కారు వారి పాట
మూవీ తో అద్భుతమైన విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. టాలెంటెడ్
డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ
మూవీ లో
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ...
తమన్ ఈ క్రేజీ
మూవీ కి సంగీతం అందించాడు. సముద్ర కని ఈ
మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ తో మహేష్ బాబు మరో విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.
ఇలా సర్కారు వారి పాట
మూవీ విజయంతో మంచి
జోష్ లో ఉన్న మహేష్ బాబు ప్రస్తుతం
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభమై ఒక షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరి కొన్ని రోజుల్లోనే ఈ
మూవీ సెకండ్ షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి సంబంధించిన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... మహేష్ బాబు ...
త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ
మూవీ లో
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ కూతురు అర్హా ను ఒక కీలకమైన పాత్రలో తీసుకోవాలి అని ఈ
మూవీ మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలుబడలేదు. ఇది ఇలా ఉంటే ఇది వరకే మహేష్ ...
త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు ...
ఖలేజా అనే రెండు
మూవీ లు తెరకెక్కాయి. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ మూవీ.