పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు
మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ
మూవీ లో అందాల ముద్దుగుమ్మ
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ మ్యూజిక్
డైరెక్టర్ ఎం ఎం
కీరవాణి ఈ
మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ
మూవీ కి సంబంధించిన షూటింగ్ ఇప్పటి వరకే చాలా భాగం పూర్తయినట్లు తెలుస్తోంది.
మరికొన్ని రోజుల్లోనే ఈ
మూవీ షూటింగ్ ను మొత్తం ముగించబోతున్నట్లు సమాచారం. ఈ
మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్
ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. పవన్
కళ్యాణ్ మరియు క్రిష్ జాగర్లమూడి ఇద్దరు కెరియర్ లోను ఇదే మొట్ట మొదటి పాన్
ఇండియా మూవీ కావడంతో ఈ
మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ
మూవీ సెట్స్ పై ఉండగానే పవన్
కళ్యాణ్ ...
హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్
మూవీ లోను ...
సుజిత్ దర్శకత్వంలో మరో
మూవీ లోను ... సముద్ర కని దర్శకత్వంలో మరో
మూవీ లోను నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఇలా వరస
మూవీ కామెంట్ లతో ఫుల్
జోష్ లో ఉన్న పవన్
కళ్యాణ్ తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో
బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లోని ఒక
ఎపిసోడ్ కు గేస్ట్ గా వచ్చిన విషయం మనకు తెలిసింది. తాజాగా ఈ
ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది. ఆన్ స్టాపబుల్ సీజన్ 2 లోని పవన్
కళ్యాణ్ కు సంబంధించిన
ఎపిసోడ్ ను ఈ సంవత్సరం
సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేయడానికి ఆహ నిర్వాహక బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.