సౌత్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సమంత. గత కొంతకాలంగా సమంత అనారోగ్య సమస్యతో పూర్తిస్థాయిలో షూటింగ్లను మానేసి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక తాను నటించిన యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా అప్పట్లో సోషల్ మీడియా మరియు కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమంత అప్పటినుండి ఇప్పటివరకు మళ్లీ ఎక్కడ కూడా కనిపించడం లేదు. అయితే తాజాగా చాలా కాలం తర్వాత తన సోషల్ మీడియా వేదిక ద్వారా తన అభిమానులతో చిట్ చాట్ చేసింది సమంత.
ఇందులో భాగంగానే సమంత అభిమానులు తనను అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా నిదానంగా సమాధానం చెప్పుకొచ్చింది. అయితే ఇందులో భాగంగానే సమంత అభిమాని జీవితం ఎలా ఉంది అంటూ ప్రశ్నించాడు.. ఇందుకు సమంత ఎవరు ఊహించిన విధంగా సమాధానం ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తన అభిమాని అడిగిన ప్రశ్నకుగాను సమంత..ప్రస్తుతం జీవితం గతంలో మాదిరిగా కాకుండా మరోలా ఉంది.. ఎన్నడు ఊహించిన విధంగా నా జీవితంలో అన్నిటినీ ఎదుర్కొంటున్నాను అంటూ సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా మీలాంటి అభిమానులే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు..
మీ వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను.. మీరందరూ ఎప్పుడు నన్ను వెన్నంటే ఉండి నడిపిస్తున్నారు.. అంతేకాదు నాకోసం ప్రతిరోజు ప్రార్ధిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. మీరందరూ ఇలా చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చింది సమంత. అయితే అంతకు ముందులా జీవితం ఇప్పుడు లేదు అని యధావిధి స్థితికి ఎప్పుడు వస్తుందో చెప్పలేను అన్నట్లుగా సమంత చెప్పడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది.ఈమె నటించిన ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో సమంత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!