టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్ లో జరుగుతున్నాయో తెలిసిందే. మా హీరో గొప్ప అంటే లేదు మా హీరో గొప్ప అంటూ అభిమానులు ఓ రేంజ్ లో గొడవలు పడుతున్నారు. ఈ గొడవలు కాస్త తారాస్థాయికి చేరిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో ప్రధానంగా మెగా నందమూరి అభిమానుల మధ్య చాలా కాలం నుంచి ఈ ఫ్యాన్ వార్ నడుస్తుంది. నిజానికి పలు ఈవెంట్స్ లో తామంతా ఒక్కటేనని హీరోలు చెబుతూ ఉంటారు. కానీ ఫ్యాన్స్ మాత్రం హీరోలు చెప్పిన దానికి భిన్నంగా గొడవలు పడుతూ ఉంటారు. ఇక ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షోలో పవన్ కళ్యాణ్ సందడి చేసిన విషయం తెలిసిందే కదా. అప్పుడు ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నిజానికి అభిమాన హీరోల సినిమాలు విడుదలైన సమయంలోనే కాకుండా..
ఈమధ్య ఎక్కువగా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఇతర ఈవెంట్స్ లో గొడవలకు దిగుతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో తెలుగు వాళ్ళంతా కలిసి ఏర్పాటు చేసిన 'న్యూ ఇయర్ ఈవెంట్' లో నందమూరి మెగా అభిమానులు గొడవ పడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డల్లాస్ లోని తెలుగు వాళ్ళంతా కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకోసం 'తగ్గేదే లే' అనే పేరుతో ఈవెంట్ ని ప్లాన్ చేశారు. అయితే ఈ ఈవెంట్ లో చాలామంది తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్ కూడా చీఫ్ గెస్ట్ గా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్లో బాలకృష్ణ పాటలు వేసి జై బాలయ్య నినాదాలతో అభిమానులు తెగ సందడి చేశారు. ఈ క్రమంలోనే మెగా ఫాన్స్ మెగాస్టార్, పవర్ స్టార్ పాటలు వేయాలని కోరారు. అందుకు ఫ్యాన్స్ నిరాకరించడంతో అక్కడ గొడవ మొదలైంది.
ఈ క్రమంలోనే నారా చంద్రబాబు నాయుడు సన్నిహితుడైన కేసి చేకూరి ఈ కార్యక్రమంలో మెగా ఫాన్స్ పై దాడి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి పాటలు వేయం.. మీ ఇష్టం ఉంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి అంటూ గొడవకు దిగినట్టు తెలుస్తోంది. ఇక అంతటితో ఆగకుండా పవన్ కళ్యాణ్ చిరంజీవిలా బ్యానర్స్ ని కూడా కాల్చివేశారట. ఆ సమయంలో అడ్డుకున్న సెక్యూరిటీ వాళ్లపై కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది. అలా ఈ కార్యక్రమంలో మొదలైన గొడవ పెద్దది కావడంతో వెంటనే అమెరికన్ పోలీసులు రంగంలోకి దిగి కేసీ చేకూరి నీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇక ఈ కేసి చేకూరి విషయానికొస్తే.. తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగంలో ఇతను ఒక కీలక సభ్యుడు. అంతేకాదు అమెరికాలో చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు ప్రధాన అనుచరుగా కూడా ఉన్నాడు..!!