"వీర సింహరెడ్డి" తో "వాల్తేరు వీరయ్య".. వాళ్ళ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..!?

Anilkumar
ఈమధ్య మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సినిమాలు విడుదలవుతున్నాయి అంటే ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా నుంచి యూట్యూబ్ టీవీ ఇలా అన్ని ప్లాట్ఫార్మ్స్ ని వాడేసుకుంటున్నారు. సెలబ్రిటీస్ ఇందులో ఇంటర్వ్యూస్ ఎక్కువగా ఉంటాయి. రియాలిటీ షోలు టాక్ షోలు అంటూ రకరకాల వాటికి మూవీ టీం ప్రమోషన్స్ కి వెళ్తుంటారు. అలాంటిది ఒకే నిర్మాణ సంస్థ నుండి ఒకేసారి రెండు సినిమాలు వస్తే అది ఇంకా కష్టమే అవుతుంది. ప్రస్తుతం అలాంటి ఓ సిచువేషన్ ఫేస్ చేస్తున్నారు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రమంలోని ఈ నిర్మాతలు భారీ ప్లాన్ వేశారు. అందుకు అన్ స్టాపబుల్ టాక్ షో వేదిక కానుంది. 

ఇది కనక వర్కౌట్ అయితే సినిమాకి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ అంటున్నారు. ఆహా ఓటీపీ వేదికగా నందమూరి బాలకృష్ణ అండ్ స్టాపబుల్ అనే టాక్ షో రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ షోలో వీర సింహారెడ్డి తో వాల్తేరు వీరయ్య కలుస్తాడట.అంటే ఈ రెండు సినిమాల టీం లను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. దీని ప్రకారం వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య రెండు టీం లను ఒకే ఎపిసోడ్లో చూపించాలని అన్స్టాప బుల్ టీం భావిస్తోందట. మరి ఈ రెండు సినిమాల టీం నుండి ఎవరెవరు వస్తారు అన్నది చూడాలి. ఈ రెండు సినిమాలకు నిర్మాతలు కొరియోగ్రాఫర్స్ ఫైట్ మాస్టర్స్ మాత్రం ఒకరే.

ఇక మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య విషయాన్నికొస్తే త్వరలోనే ఏ సినిమా నుంచి అయిదో పాట విడుదల కాబోతోంది. ఆ వెంటనే ఈ సినిమాని నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ ని వాల్తేరులో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈవెంట్ లోనే వాల్తేరు వేరే ట్రైలను రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు బాలయ్య వీరసింహారెడ్డి ట్రైలర్ ఈవెంట్ ను ఒంగోలులో నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈనెల ఆరవ తేదీన ఒంగోలులో ఈ ఈవెంట్ ఉండబోతుందట. ఇక వీటితో పాటు హైదరాబాదులో సైతం రెండు పెద్ద ఈవెంట్లను నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నాయి. మరి ఈ రెండిట్లో సంక్రాంతి విన్నర్ ఎవరో తెలియాలంటే ఈ రెండు సినిమాలో విడుదల అయ్యేంతవరకు వేచి చూడాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: