బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. జనవరి 6న ఫైర్ ఫైర్.. అంటున్న థమన్..!!
అలాగే దునియా విజయ్ ,వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పలు అప్డేట్లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొక భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అందుకు సంబంధించి ఒక భారీ ఈవెంట్ ను కూడా నిర్వహించబోతున్నట్లు సమాచారం. వీర సింహారెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ప్లేస్ ఫిక్స్ చేసినట్లుగా సమాచారం.
ఈనెల 6వ తేదీన ఒంగోలులో MBA కాలేజీలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నట్లు సమాచారం .ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలియజేసింది మరొకవైపు అదే రోజు సాయంత్రం ఈవెంట్లో ట్రైలర్ను కూడా విడుదల చేయబోతున్నట్లు ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ లీక్ చేయడం జరిగింది. ఇప్పుడు వీరసింహారెడ్డి ట్రైలర్ కోసం అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులకు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది నందమూరి బాలయ్య కెరియర్ మార్చేతుందా లేదా అనే విషయం కూడా ఈ సినిమా పైన ఆధారపడింది. జనవరి 6న ఫైర్ ఫైర్ ఫైర్ అని తమన్ ట్విట్ చేయడం జరిగింది.