టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా. ప్రస్తుతం అటు వెండి తెరపై మరియు ఇటు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది ఈమె. అయితే గత కొన్ని రోజులుగా ఈమెకి సంబంధించిన అనేక రకాల వార్తలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నిలుస్తోంది తమన్నా. ఈమెకి సంబంధించిన ప్రేమ మరియు పెళ్లి గురించి చాలా రకాల రూమర్లు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా ఆయనతో కలిసి దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి.ఇక సోషల్ మీడియాలో వీరికి సంబంధించి వైరల్ అవుతున్న ఫోటోలలో వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండడంతో ఇలాంటి వార్తలు వస్తున్నాయి అంటూ అంటున్నారు. అయితే ఇందులో భాగంగానే తమన్నకి సంబంధించిన మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. తాజాగా జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో తమన్నా ఒక పింక్ టాప్ ను వేసుకోవడం జరిగింది.
ఈ న్యూ ఇయర్ వేడుకల్లో పింక్ టాప్ వేసుకొని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది తమన్న. అయితే తాజాగా ఈమె ధరించిన ఈ టాప్ ధర ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే న్యూ ఇయర్ వేడుకల్లో తమన్న ధరించిన ఈ డ్రెస్ ధర 2,27,830 రూపాయలుగా తెలుస్తోంది. గతంలో కరణ్ జోహర్ బర్త్డే వేడుకల్లో కూడా తమన్నా ఈ డ్రెస్ ను వేసుకోవడం జరిగింది. దీంతో తమన్నా వేసుకున్న ఈ డ్రెస్ ధర వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!