PS-2 ప్రమోషన్ షురూ.. క్లారిటీ ఇచ్చిన లైకా..!

Divya
ప్రముఖ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్. గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించిన ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్, త్రిష , విక్రమ్ చియాన్, కార్తీ , జయం రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు లభించింది. ప్రత్యేకంగా ఈ సినిమాలో చోళ యువరాణి కుందవై పాత్రలో నటించిన త్రిషకు భారీ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం వరుస సినిమాలు ఆమె ఇంట క్యూ కడుతున్నాయి.
ఈ క్రమంలోనే పొన్నియన్ సెల్వన్ -2 చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  ఈ క్రమంలోనే సినిమాను ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే.  గతంలో బాహుబలి 2  కూడా ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అయ్యి రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.  ఈ సెంటిమెంట్ ని మణిరత్నం ఫాలో అవుతూ ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ చేసే విధంగా సన్నహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చేపట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయంపై లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ అధికారికంగా స్పందిస్తూ.. పొన్నియన్ సెల్వన్ -2 చిత్ర ప్రమోషన్స్ మార్చి నెల నుంచి కిక్ స్టార్ట్ అవుతాయని స్పష్టం చేశారు. మొదటి పార్ట్ తో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండవ భాగంతో ఎలాంటి విజయాన్ని అందుకోబోతోంది అని ప్రేక్షకులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  మరి ఈ సినిమా బాహుబలి రేంజ్ లో హిట్ అవుతుందో లేదో తెలియాలి అంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: