"చిరంజీవి తో ఆ పని చేసేటప్పుడు చాలా ఇబ్బంది గా ఫీల్ అయ్యాను.." షాకింగ్ విషయాలను చెప్పిన శృతిహాసన్..!?

Anilkumar
టాలీవుడ్ ని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. ఇటీవల ఆమె నటించిన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అనంతరం వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈమె. చేతినిండా సినిమాలతో ప్రస్తుతం  స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తుంది శృతిహాసన్. అంతేకాకుండా బాలయ్య నడుస్తున్న వీరసింహారెడ్డి మరియు మెగాస్టార్ చిరంజీవి  వాల్తేరు వీర సినిమాలలో సైతం నటిస్తోంది శృతిహాసన్. ఒకవైపు ప్రభాస్ నటించిన సలార్ సినిమా షూటింగ్ దశలో ఉండగా ...

మరోవైపు ఈమె హీరోయిన్గా నటించిన బాలయ్య మరియు చిరంజీవిల సినిమాలు సంక్రాంతి కానుకగా ఒకేసారి విడుదల కానున్నాయి.ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించి విడుదలైన పాటలు మరియు టీజర్లు మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ప్రస్తుతం చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ జోరుగా నడుస్తున్నాయి.ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా అంటూ సాగే పాట ఫ్రాన్స్ లోని మంచు కొండల్లో చిత్రీకరించారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న శృతిహాసన్ ఈ పాట గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది..

ఇందులో భాగంగానే ఈ పాట గురించి ఆమె మాట్లాడుతూ.. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో మైనస్ డిగ్రీ ఉంది.. ఆ పాట కోసం ముఖ్యంగా నేను చీర కట్టుకున్నాను.. అక్కడున్న ఆ వాతావరణం లో చీర కట్టుకొని డాన్స్ చేయడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.. కానీ మా అభిమానుల కోసం ఎలాంటి పని చేయక తప్పదు.. మొదట ఈ పాట చెప్పినప్పుడు మంచు కొండల్లో డాన్స్ చేసే అవసరం లేదు అని అనుకున్నాను.. ఎందుకు అంటే అక్కడి వాతావరణం అంత అసౌకర్యంగా ఉంది.. మైనస్ డిగ్రీల చలిలో నటించడం అంటే మామూలు విషయం కాదు.. ఆ సమయంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను.. అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. ఇక మెగాస్టార్ చిరంజీవి మరియు శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇక ఇప్పటికే వీరిద్దరికీ సంబంధించి విడుదలైన పాట ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ ను కనబరిచింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: