ఈ
మూవీ లో
బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఒక పాత్రలో
బాలకృష్ణ ... బాల
సింహా రెడ్డి గాను ... మరో పాత్రలో వీర
సింహా రెడ్డి గారు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లోనూ అద్భుతమైన వేరియేషన్స్ ను
బాలకృష్ణ చూపించినట్లు విశ్వసినీయ వర్గాల నుండి సమాచారం. ఈ
మూవీ ని ఈ సంవత్సరం
సంక్రాంతి కానుకగా
జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
అందులో భాగంగా ఈ
మూవీ ని యూఎస్ఏ లో కూడా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ లు కూడా యూఎస్ఏ లో ఓపెన్ అయ్యాయి. అందులో భాగంగా వీర
సింహా రెడ్డి
మూవీ ని యూఎస్ఏ లో 115 లొకేషన్ లలో ... 278 షో స్ వేయనున్నారు. ఇప్పటికే ఈ
మూవీ కి యూఎస్ఏ లో అద్భుతమైన ఫ్రీ బుకింగ్ సేల్స్ ను అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.