తమన్నా ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో శ్రీ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి వెండితెరకు పరిచయమైంది తమన్న. దాని అనంతరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీడేస్ సినిమాతో స్టార్ హీరోయిన్ గుర్తింపును పొందింది.ఈ సినిమా తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి అమాంతం తన క్రేజ్ పెంచుకుంది మిల్కీ బ్యూటీ తమన్న. అయితే ఇప్పుడు తమన్నాకి సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. 33 సంవత్సరాల వయసు దాటినప్పటికీ ఇంకా తమన్నా పెళ్లి చేసుకోకపోవడంతో ఈమెకి సంబంధించి అనేక రకాల రూమర్లు సైతం వస్తున్నాయి. 

అయితే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది అన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు అంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇదే క్రమంలో మిల్కీ బ్యూటీ తమన్న ఆస్తులు గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి.అంతే కదా స్టార్ హీరో రేంజ్ లో ఆస్తులను కూడబెట్టింది అని సమాచారం. ఈ క్రమంలోనే తమన్నా ఆస్తి విలువ మొత్తం దాదాపు 120 కోట్లకు పైగానే ఉంటుంది అని తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం తమన్నా పలు వాణిజ్య ప్రకటనలకు

 బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ 12 కోట్లకు పైగానే సంపాదిస్తుంది. అంటే ఈమె నెలసరి ఆదాయం దాదాపు కోటి రూపాయలు ఉంటుంది. ఇక తమన్నా ఒక్క సినిమాలో నటిస్తే ఖచ్చితంగా ఐదు కోట్లకు పైగాని రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.కథను బట్టి పారితోషికాన్ని ఎక్కువ కూడా డిమాండ్ చేస్తుంది తమన్న. ఇటీవల మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో నటించినందుకు గాను ఏకంగా 60 లక్షలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంది తమన్నా. ఇక 2018లో ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో 10 నిమిషాల్లో ప్రకటన కోసం ఏకంగా 50 లక్షలు తీసుకుంది. ఇదిలా ఉంటే ముంబైలో తమన్న కి 16 కోట్ల విలువైన అపార్ట్మెంట్ ఉంది. దాంతో పాటు లగ్జరీ వాహనాలు కూడా ఉన్నాయి. వీటన్నిటితోపాటు తమన్న దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద ఐదవ వజ్రం ఉంది అని దాని విలువ సుమారు రెండు కోట్లకు పైగానే ఉంటుంది అని తెలుస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: